Friday, July 23, 2010

Lalli Pata

నాకు నచ్చిన లాల్లి పాట
పల్లవి
జో అచ్చుతానంద జోజో ముకుందా
రావే పరమానంద రామగోవింద
     (జో)
చరణం ౧
     నందునింటను జేరి నయము మీరంగ
     చంద్ర వదనాలు నీకు సేవసెయంగా
అందముగా వారింట్ల ఆడుచున్డంగా
మందలకు దొంగ మా ముత్తు రంగ
(జో)
చరణం ౨ 
    అంగజుని కన్నా మాయన్న యిటురారా
    బంగారు గిన్నెలో పాలు పోసేరా
    దొంగ నీవని సతులు పొంగు కున్నారా 
    ముంగిట ఆడారా మోహనాకారా 
    (జో)
చరణం ౩ 
అంబుగా తాల్లపాకన్నమియ చాల
    శృంగార రసానగా చెప్పెనీ జోల
    సంగతిగ సకల సంపదలనీవేల
    మంగళము తిరుపట్ల మదన గోపాల 
    (జో)

No comments:

Post a Comment